Namaste NRI

భయాందోళనల్లో భారతీయ విద్యార్థులు

అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటూ భారతీయ విద్యార్థులను భయాందోళనల్లోకి నెడుతున్నాడు. వారిని కుదురుగా చదువుకోనిచ్చేలా లేడు. యూనివర్సిటీలు, కాలేజీలలో నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు వణికిపోతున్నారు. కాంపస్ లలో నిరసనల్లో పాల్గొన్న విద్యార్థుల పేర్లు, వారి జాతీయతను గుర్తించి తెలియజేయాలని ట్రంప్ సర్కార్ డిమాండ్ చేయడం తో తమపై కఠిన చర్యలు తీసుకుంటారని భారతీయ విద్యార్థులతో పాటు, అంతర్జాతీయ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పాలస్తీనాకు మద్దతుగా ప్రదర్శనల్లో పాల్గొన్నవారు, యూదు విద్యార్థులను వేధింపులకు గురిచేసిన వారి పై దృష్టి పెట్టారు. విద్యార్థుల పేర్లు, జాతీయతను తెలుపాలన్న డిమాండ్ వల్ల, విద్యార్థులపై నిఘా, పర్యవేక్షణ పెరగవచ్చు, అరెస్ట్ లు చేయడమో, బహిష్కరణకు గురిచేయడమో చేస్తారేమోనని న్యాయనిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే కొంతమంది భారతీయ విద్యార్థులు ట్రంప్ యంత్రాంగం ఆగ్రహాన్ని చవిచూడడం మరింత ఆవేదన కల్గిస్తోంది. అమెరికాలో చాలా మంది అంతర్జాతీయ దేశాల విద్యార్థులు ఉన్నారు. భారతీయ విద్యార్థులే 3,31,602 మంది ఉన్నారు. వీరంతా భయపడుతున్నారు. ఈ మధ్యనే కొలంబియా వర్సిటీలో భారతీయ విద్యార్థిని రంజని శ్రీనివాసన్ కు చెందిన స్టూడెంట్ వీసా రద్దు చేయడంతోస్వయంగా దేశ బహిష్కరణకు గురయ్యారు. భారత సంతతికి చెందిన మరో రీసర్చ్ స్టూడెంట్ బాదర్ ఖాన్ సూరి ని హమాస్ సీనియర్ అధికారితో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణపై దేశ బహిష్కరణ ఎదుర్కొంటున్నారు.విద్యాశాఖలో పౌరహక్కులకు సంబంధించిన సహాయ మంత్రి క్రెయిన్ ట్రైనర్ ఈ విధానాన్ని సమర్థించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UULmVdT0LRtF67ZbuX2dEeQQ&layout=gallery[/embedyt]