Namaste NRI

అమెరికాకు క్యూ కడుతున్న భారతీయ విద్యార్థులు

అమెరికా వెళ్లే వారి సంఖ్య హైదరాబాద్ నుంచి  ఎక్కువగా ఉంటోంది. ఈ సంఖ్య ముంబై, న్యూఢిల్లీ సిటీల కంటే ఎక్కువగా ఉందని తెలుస్తోంది. 2021-22లో అమెరికాలోని  విశ్వవిద్యాలయాలలో 2.61 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో దాదాపు 75,000 మంది భారతీయులేనని ఓపెన్ డోర్స్ నివేదిక పేర్కొంది. అయితే ఈ 75వేల మంది భారతీయుల్లో 30శాతం మంది హైదరాబాద్కు చెందిన వారే కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం.

గత రెండేళ్ల నుంచి అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య 19 శాతం పెరిగింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే అమెరికన్ యూనివర్సిటీల్లో భారతీయ విద్యార్థుల పెరిగిందని, 10లక్షల మంది విదేశీ విద్యార్థుల్లో దాదాపు 21 శాతం మంది భారతీయ విద్యార్థులేనని ఆ నివేదికలో వెల్లడయ్యింది.  2020-21లో 1,67,582 మంది ఉండగా.. 2021-22లో 1,99,182 మంది భారతీయ విద్యార్థులు యుఎస్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య 2022-23లో చైనాను అధిగమించే అవకాశం ఉన్నట్టు పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events