Namaste NRI

భారతీయురాలికి యూఏఈలో మరణ శిక్ష అమలు

నాలుగు నెలల చిన్నారి హత్య కేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన షహజాది ఖాన్‌ కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో మరణశిక్షను అమలు చేశారు. దీంతో ఆమె జీవించి లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఎ) స్పష్టం చేసింది. ఫిబ్రవరి 15న మరణశిక్ష అమలు చేసినట్లు కోర్టుకు తెలిపింది. మార్చి 5న ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తారని వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌లోని బండా జిల్లాకు చెందిన 33 ఏళ్ల షహజాది ఖాన్ 2021 డిసెంబర్‌లో అబూ దాబి వెళ్లింది. 2022 ఆగస్ట్‌లో ఒక ఇంట్లో పనికి చేరింది. యజమానురాలు జన్మనిచ్చిన బాబుకు సంరక్షకురాలిగా వ్యవహరించింది.

కాగా, 2022 డిసెంబర్‌ 7న వ్యాక్సిన్ల కారణంగా నాలుగు నెలల పసి బాబు మరణించాడు. అయితే తమ కుమారుడి మృతికి షహజాది ఖాన్ కారణమని యజమాని కుటుంబం ఆరోపించింది. వారి ఫిర్యాదితో అబూ దాబి పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు. 2023 ఫిబ్రవరిలో షహజాది ఖాన్‌ నేరాన్ని ఒప్పుకున్నట్లుగా ఒక వీడియో బయటకు వచ్చింది. అయితే హింసించి బలవంతంగా నేరాన్ని ఒప్పించినట్లు ఆమె కుటుంబం ఆరోపించింది.

మరోవైపు 2023 జూలై 31న షహజాది ఖాన్‌కు అబూ దాబి కోర్టు మరణశిక్ష విధించింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 15న కుమార్తె తనతో చివరిసారి మాట్లాడినట్లు ఆమె తండ్రి తెలిపారు. మరణశిక్ష అమలు కోసం మరో జైలుకు తరలించినట్లు ఆమె చెప్పిందన్నారు. చివరి కోరికగా తనతో మాట్లాడించినట్లు ఆయన వెల్లడించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events