Namaste NRI

అమెరికాలో భారత ఉద్యోగులు ఆందోళన

అమెరికాలోని భారత ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అమెరికా జాబ్‌ మార్కెట్‌ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది.  గతంలో ఎన్నడూ లేనంతగా ఉద్యోగ భయం వారిని వెంటాడుతున్నది. దీంతో ఇక్కడే ఉండాలా స్వదేశానికి తిరిగి వెళ్లాలా అని వారు అయోమయం చెందుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో వేలాది మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మాంద్యం భయాలతో పలు టెక్‌ కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. పెద్దపెద్ద సంస్థలు సైతం ఉద్యోగాలకు కోత పెడుతున్నాయి. ఇలా జాబ్‌లు కోల్పోయిన వారిలో చాలామంది కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడం కష్టంగా మారింది. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా చాలా కంపెనీలో కొత్తగా నియామకాలు కూడా చేపట్టడం లేదు.

 అమెజాన్‌, మెటా, సేల్స్‌ఫోర్స్‌, ట్విట్టర్‌, ఉబర్‌ వంటి సంస్థలు వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఈ ఏడాది లేఆఫ్‌లు భారీగా ఉంటాయని, హెచ్‌1బీలకు సైతం ఉద్యోగాలు దొరక్కపోవచ్చని అంటున్నారు. అమెరికాలో ఉద్యోగాన్ని కోల్పోతే 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. లేదంటే దేశాన్ని వీడక తప్పదు. ఈ ఏడాది కూడా టెకీలకు గడ్డుకాలం తప్పదని నిపుణులు చెబుతున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events