మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన కార్తిక్ జయస్‌వాల్ (21) ప్రపంచ రికార్డు సృష్టించారు. జయస్‌వాల్ గంటలో 3,331 పుషప్స్ చేసిన రికార్డు సృష్టించారు. ఇందుకోసం రెండేళ్లుగా నిత్యం ఆరు గంటలు సాధన చేసినట్లు తెలిపారు. గతంలో 44 సెకన్లలో 770 టైల్స్ పగలగొట్టి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ కార్తిక్ చోటు సంపాదించాడు. ఇప్పటి వరకు గిన్నస్ బుక్‌లో ఆస్ట్రేలియా వ్యక్తి పేరిట ఉన్న రికార్డును కార్తిక్ తిరగరాశాడు.














