మిస్ యునివర్స్ 2021 పోటీల్లో భారత యువతి హర్నాజ్ సంధు విజేతగా నిలిచింది. 80 దేశాల నుంచి వచ్చిన అందగత్తెలను వెనక్కి నెట్టి కిరీటాన్ని కైవసం చేసుకుంది. తన అందంతో పాటు పదునైన సందేశం, తెలివైన సమాధానాలతో అందరినీ అబ్బురపరిచింది. హర్నాజ్ సంధు పంజాబీ ప్రాంతానికి చెందిన అమ్మాయి. మోడలింగ్, వెండితెరపై ఆసక్తితో ఆమె విద్యార్థి దశలోనే ఫ్యాషన్ రంగంపై వైపు అడుగులు వేశారు. మోలింగ్‌లో రాణించడంతో పాటు పలు పంజాబీ చిత్రాల్లోనూ నటించారు. 21 ఏళ్ల తర్వాత భారత్‌కు మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. గతంలో ఈ ఘనతను సాధించిన సుస్మితా సేన్ (1994), లారా దత్తా (2000)ల సరసన చేరింది.














