కెనడా దేశంలో భారతీయులు ఎక్కువగా ఉన్నారు. కెనడా జనాభాలో 23 శాతం మంది వలసదారులే ఉన్నారు. కొత్తగా వస్తున్న వలసదారుల్లో ఆసియా దేశాలకు చెందిన వారు 62 శాతం మంది ఉంటున్నారని, వీరిలో భారతీయులే అధికమని కెనడా గణాంక సంస్థ సెన్సస్ రిపోర్టు `2021లో పేర్కొన్నది. భారత్ 18.6 శాతంతో మొదటి స్థానంలో ఉన్నది. ఆ తర్వాతి స్థానంలో పిలిప్పీన్స్ 11 4శాతం, చైనా 8.9 శాతం ఉన్నాయి. 2021 లో కెనడా జనాభాలో 83 లక్షల మంది వలసదారులున్నారు. 2041 నాటికి ఈ సంఖ్య 34 శాతానికి పెరుగుతుందని స్టాటిస్టిక్స్ కెనడా అంచనా వేసింది. లేబర్ కొరత నెలకొన్న నేపథ్యంలో ఆ దేశానికి వలసలు పెరిగాయని విశ్లేషణలు వస్తున్నాయి.
