Namaste NRI

భారతీయులు  సరికొత్త రికార్డు

బ్రిటన్‌లో   భారతీయులు తాజాగా సరికొత్త రికార్డు సృష్టించారు. చైనా వారిని   వెనక్కునెట్టి మరీ ఇండియన్స్   అత్యధికంగా బ్రిటన్ స్టూడెంట్ వీసాలు  పొందిన విదేశీయులుగా రికార్డు నెలకొల్పారు.  కొన్నేళ్లుగా బ్రిటన్ వీసాలు పొందుతున్న భారత విద్యార్థుల సంఖ్య ఏకంగా 273 శాతం పెరిగిందని తాజాగా విడుదలైన బ్రిటన్ హోం శాఖ గణాంకాలు చెబుతున్నాయి.  వృత్తి నిపుణులకు ఇచ్చే వర్క్ వీసాలు  పొందుతున్న విదేశీయుల్లో భారతీయులే ముందున్నారు. గతేడాది భారతీయులకు 56,042 వర్క్ వీసాలు జారీ అయ్యాయి. విదేశీ వైద్య వృత్తినిపుణులకు ఇచ్చే స్కిల్డ్ వర్క్ హెల్త్ అండ్ కేర్ వీసాల్లో ఏకంగా 36 శాతం భారతీయులే దక్కించుకున్నారు. దీంతో అమెరికా ప్రజావైద్య రంగంలో భారతీయుల కీలక పాత్ర పోషిస్తున్నట్టు మరింతగా తేటతెల్లమైంది. స్పాన్సర్డ్ స్టడీ వీసాలు  దక్కించుకున్న విదేశస్తుల్లో చైనీయులు రెండో స్థానంలో ఉన్నారని బ్రిటన్ హోం శాఖ అధికారి ఒకరు తెలిపారు. 2019తో పోలిస్తే ప్రస్తుతం బ్రిటన్ వీసాలు పొందిన ఇండియా, నైజీరియా, పాకిస్థాన్, బాంగ్లాదేశీ విద్యార్థుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. జూన్ 2021తో ముగిసిన ఏడాది కాలంలో బ్రిటన్‌లోకి వలసొచ్చిన వారి సంఖ్య 1,73,000 కాగా, జూన్ 2022 నాటికి ఈ సంఖ్య ఏకంగా 5,04,000కు చేరింది. లాక్‌డౌన్ ఆంక్షలు ముగియడం, బ్రెక్జిట్ తరువాత పూర్తికాలానికి గణాంకాలు అందుబాటులో ఉండటం, హాంగ్‌కాంగ్ బ్రిటీష్ నేషనల్స్ కోసం కొత్తగా ప్రవేశపెట్టిన వీసా విధానం కారణంగా, బ్రిటన్‌లో దీర్ఘకాలిక వలసల సంఖ్య బాగా పెరిగినట్టు తెలుస్తోంది. ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల్లో భారత యూనివర్సిటీలకు చోటు దక్కకపోయినా..వీటిల్లో చదివిన వారు మాత్రం హైపొటెన్షియల్ వీసాలను కొల్లగొట్టడం గమనార్హం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events