Namaste NRI

అమెరికాలోకి  అక్రమంగా ప్రవేశిస్తూ భారతీయులు

అగ్రరాజ్యం అమెరికాలోకి  అక్రమంగా ప్రవేశిస్తూ భారతీయుల  సంఖ్య పెరిగినట్టు తాజా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అధికారులకు పట్టుబడ్డ భారతీయుల సంఖ్య 2022లో రెండింతలకు పైగానే పెరిగినట్టు  అధికారిక లెక్కల్లో తేలింది. గత అక్టోబర్ నవంబర్ నెలల్లో అమెరికా సరిహద్దు గస్తీ దళాలు మెక్సికో సరిహద్దు వద్ద 4,297 మంది భారతీయుల్ని అదుపులోకి తీసుకున్నాయి. 2021 ఏడాది ఇదే కాలంలో అమెరికాలోకి అక్రమంగా చొరబడుతూ పట్టుబడ్డ ఇండియన్ల సంఖ్య 1,426.  2021-22 మధ్య అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించబోయి అధికారులకు చిక్కిన ఇండియన్ల సంఖ్య రెండింతలకు పైగానే పెరిగిందని ప్రభుత్వ గణాంకాల్లో తేలింది.  2022 సెప్టెంబర్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వివిధ దేశాలకు చెందిన 2.77 మిలియన్ల మంది అగ్రరాజ్యంలోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించినట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అంతకుమునుపటి ఏడాదితో పోలిస్తే అక్రమవలసలు 41 శాతం పెరిగినట్టు అమెరికా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ శాఖ గణాంకాల్లో తేలింది.

       బైడెన్ అధికారంలోకి వచ్చాక అమెరికాలోకి అక్రమవలసలు పెరిగాయని అక్కడి వర్గాలు చెబుతున్నాయి. అమెరికా సరిహద్దులు సురక్షితమని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తరచూ చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events