అమెరికాలో శాశ్వత నివాసానికి వీలు కల్పించే గ్రీన్‌కార్డుల జారీలో భారతీయులకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని అమెరికా శాసనకర్తలు ప్రభుత్వాన్ని కోరారు. భారతీయుల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతూ 56 మంది శాసనకర్తలు అమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ ఆంటోని బ్లింకెన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రెటరీ అలెజాండ్రోకు లేఖ రాశారు. ప్రస్తుత పద్ధతి ప్రకారం భారీగా నిరీక్షిస్తున్న భారతీయులందరికీ గ్రీన్‌కార్డులు జారీ చేయాలంటే కనీసం 195 ఏండ్లు పడుతుందని వారు పేర్కొన్నారు. అత్యుత్తమ నైపుణ్యం ఉన్న భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వారు లేఖలో తెలిపారు. చట్టబద్ధ వలస వ్యవస్థలో అధికార యంత్రాంగ అలసత్వం వల్ల వీసాలు పెండిరగులో పడిపోయి, ఉద్యోగాలు మారాలనుకున్నవారికి, వ్యాపారాలు ప్రారంభించేవారికి, అపరాధ రుసుం లేకుండా విదేశాలకు ప్రయాణించేవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)