ఉక్రెయిన్-రష్యా మధ్య గత కొన్ని రోజులుగా యుద్ధం జరుగుతూనే ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. దీంతో ఉక్రెయిన్‌లో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారాయి. భారతీయులకు ఉక్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ కీలక సూచనలు చేసింది. ఉక్రెయిన్‌లో నెలకొన్న భయానక పరిస్థితుల దృష్ట్యా, అక్కడ నివసించే భారతీయులు వెంటనే ఆ దేశాన్ని వీడాలని సూచించింది. ఒకవేళ ఉక్రెయిన్‌లోనే ఉండాల్సిన పరిస్థితులు ఉంటే, అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని వెల్లడించింది. అంతేకాకుండా ఏదైనా సాయం కావాలంటే రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. వారం రోజుల వ్యవధిలో భారత రాయబార కార్యాలయం ప్రకటన చేయడం ఇది రెండోసారి.