Namaste NRI

రెండు దేశాల మధ్య వివాద పరిష్కారానికి..  భారత్‌ పూర్తి మద్దతు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరు దేశాధినేతలతో ఫోన్‌లో మాట్లాడారు.  ముందుగా పుతిన్‌తో మాట్లాడిన మోదీ ఇటీవలే జరిగిన ఆ దేశ అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి గెలుపొంది అత్యున్నత పదవి చేపట్టినందుకు ముందుగా ఆయన కు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఉక్రెయిన్‌తో వివాద పరిష్కారానికి చర్చలు, దౌత్యపరమైన చర్యలే మేలని సూచించినట్లు సదరు వర్గాలు తెలిపాయి. భవిష్యత్తులో ఇరు దేశాల బంధం మరింత బలపడాలని, కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నాయి.

భారత్-ఉక్రెయిన్ బంధం బలోపేతం చేయడంపై అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మోదీ చర్చించారు. ప్రస్తుతం యుద్ధం ముగింపునకు, శాంతిస్థాపనకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. యుద్ధం నేపథ్యంలో ప్రజల అవసరాల మేరకు భారత్ మానవతాసాయం కొనసాగిస్తుందని హామీ ఇచ్చినట్టు తెలిసింది. రష్యా-ఉక్రెయిన్‌ వివాదం వీలైనంత త్వరగా శాంతియుతంగా పరిష్కారం అయ్యేలా జరిగే ప్రయత్నాలకు భారత్‌ పూర్తి మద్దతు ఇస్తుందని ఈ సందర్భంగా మోదీ హామీ ఇచ్చినట్లు సమాచారం.

ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ , ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రధాని మోదీని లోక్‌సభ ఎన్నికల తర్వాత తమ దేశాల్లో పర్యటించాలని ఆహ్వానించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, వారి ఆహ్వానాన్ని మోదీ అంగీకరించారా? లేదా? అన్నదానిపై స్పష్టత లేదు. ఇక ప్రధాని మోదీ చివరిసారిగా 2018లో రష్యాలో పర్యటించిన విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events