వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవాలకు మధ్యఆసియా దేశాల అగ్ర నేతలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్, తుర్క్ మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలకు భారత్ ముఖ్య అతిథులుగా ఆహ్వానించింది. 2018లో ఆసియాన్ దేశాలను ఇలాగే ఉమ్మడిగా అతిథులను ఆహ్వానించింది. అనంతరం రెండు కన్నా ఎక్కువసార్లు, అతిథిగా ఆహ్వానించడం ఇదే తొలిసారి. మధ్య ఆసియా దేశాలతో భారత్‌కు సాంస్కృతిక, నాగరికత మరియు చారిత్రాత్మక బంధాలున్నాయి. దీంతో పాటు బలమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. వ్యూహాత్మకంగా ఈ ఐదు దేశాలతో స్నేహం భారత్‌కు మరింత కీలకం కానున్నది.
భారత ప్రభుత్వం సరిహద్దు దేశాలతో సంబంధాలను పటిష్ఠం చేసుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. అందులో భాగంగానే ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్న మధ్య ఆసియా దేశాలతోనూ సత్సంబంధాలను ప్రాధాన్యమిస్తోంది. అందుకు గణతంత్ర వేడుకలను ఓ వేదికగా మలచుకునే ఆలోచనతో ఉన్నట్లు కనిపిస్తోంది.














