Namaste NRI

వరల్డ్‌ కప్‌లో భారత్‌ జైత్రయాత్ర.. వరుసగా ఆరో విజయంతో

ఐసీసీ వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ లో భాగంగా  లక్నో వేదికగా ఇంగ్లండ్ తో జ‌రిగిన‌ పోరులో టీమిండియా బౌల‌ర్లు చెలరేగారు. త‌క్కువ స్కోర్ తోనే చేజింగ్ కు దిగిన ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్క‌లు చూపించారు. ఇంగ్లండ్ జ‌ట్టును 129 ప‌రుగుల‌కే ఆలౌట్ చేసి మ‌రో విజ‌యం త‌మ ఖాతాలో వేసుకోగా,  ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్ ల్లోనూ గెలిచి అన్ బీట‌బుల్ గా దూసుకుపోతుంది టీమిండియా.  229/9 మొదటి అయిదు మ్యాచ్‌ల్లోనూ చేధించి గెలిచిన భారత్‌, తొలిసారి తొలుత బ్యాటింగ్‌కు దిగి చేసిన స్కోరింది.  క్లిష్టమైన పిచ్‌పై తడబడ్డ జట్టును కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (87) విలువైన ఇన్సింగ్స్‌తో ఆదుకున్నాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (49), కేఎల్‌ రాహుల్‌ (39) కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. లక్ష్యం చిన్నదే అయినా పేసర్లు మహ్మద్‌ షమి ( 4/22),  జస్‌ప్రీత్‌ బుమ్రా (3/32), స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ (2/24) విజృంభించడంతో ఇంగ్లాండ్‌ 34.5 కోవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. ఆరు మ్యాచ్‌ల్లో అయిదో ఓటమి చవిచూసిన ఇంగ్లాండ్‌ సెమీస్‌ రేసు నుంచి నిష్రమించినట్లే.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events