Namaste NRI

భారత్‌- వియత్నాం మధ్య కీలక ఒప్పందం 

భారత్‌, వియత్నాం దేశాలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. తొలిసారి భారత్‌లో వియత్నాం కుదుర్చుకొన్న కీలక ఒప్పందం ఇదే కావడం  విశేషం. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, జనరల్‌ జియాంగ్‌లు పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. వీటీల్లో ఇరు దేశాల మధ్య రవాణా సహకారానికి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశారు. 2030 నాటికి ఇండియా, వియత్నాం సంయుక్త రక్షణ భాగస్వామ్యంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. చైనా బలప్రదర్శన నేపథ్యంలో భారత్‌, వియత్నాంల మధ్య సహకారానికి సంబంధించిన అవసరాలను, అవకాశాలను ప్రస్తావించారు. దీంతో పాటు భారత్‌ వియత్నాంకు అందజేయనున్న 500 మిలియన్‌ డాలర్ల లైనాఫ్‌ క్రెడిట్‌ను ఓ కొలిక్కి తెచ్చే అంశంపై కూడా చర్చలు జరిగాయి.  వియత్నాం ఎయిర్‌ ఫోర్స్‌కు శిక్షణ నిమిత్తం రెండు సిమ్యూలేటర్లు అందజేయడంతో పాటు లాంగ్వెజ్‌, ఐటీ ల్యాబ్‌లను భారత్‌ ఏర్పాటు చేస్తుందని రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events