Namaste NRI

భారత్‌ కీలక నిర్ణయం… బంగ్లాదేశ్‌లో

బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్న క్రమంలో బంగ్లాదేశ్‌లోని  హైకమిషన్‌, కాన్సులేట్స్‌ నుంచి అత్యవ సరం కాని సిబ్బందిని, వారి కుటుంబాలను ఢాకా నుంచి వెనక్కిపిలిపించాలని భారత్‌ నిర్ణయించింది. అయితే హైకమిషన్‌లో దౌత్యవేత్తలు, హైకమిషన్‌ యధావిధిగా పనిచేస్తుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

కాగా బంగ్లాదేశ్‌లో అల్లర్ల నేపధ్యంలో 199 మంది ప్రయాణీకులు, ఆరుగురు శిశువులతో కూడిన ఎయిర్‌ ఇండియా విమానం ఢాకా నుంచి ఢిల్లీ చేరుకుంది.పొరుగు దేశం బంగ్లాదేశ్‌ లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారిం ది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న బంగ్లాదేశ్‌లో విద్యార్థుల మాటున అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా బీభత్సం సృష్టిస్తున్నాయి. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events