Namaste NRI

రష్యాకు భారత్‌ షాక్‌.. ఐక్యరాజ్యసమితిలో తొలిసారిగా

రష్యాకు భారత్‌ షాక్‌ ఇచ్చింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి లో రష్యాకు వ్యతిరేకంగా భారత్‌ తొలిసారి ఓటు వేసింది. యూఎన్‌ఎస్‌సీలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రసంగించడానికి అనుకూలంగా నిలిచింది. వాస్తవానికి ఉక్రెయిన్‌పై సైనిక చర్య మొదలైన తర్వాత ఈ అంశంపై భద్రతా మండలిలో జరిగే చర్చలు, ఓటింగ్‌ల్లో భారత్‌ తటస్ఠ వైఖరి అవలంభిస్తోంది. రష్యాకు వ్యతిరేకంగా భారత్‌ ఓటు వేయడం ఇదే తొలిసారి. అటు చైనా మాత్రం ఓటింగ్‌కు దూరంగా ఉంది.  ఉక్రెయిన్‌  31వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా యుద్ధ పరిస్థితులను సమీక్షించేందుకు ఐరాస భద్రత మండలి సమావేశమైంది.  ఇందులో భాగంగా జెలెన్‌స్కీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించడాన్ని వ్యతిరేకించిన రష్యా, ప్రొసీజరల్‌ ఓటింగ్‌ను కోరిది. దీంతో 15 సభ్యదేశాలు కలిగిన మండిలో 13 దేశాలు జెలెన్‌స్కీ ప్రసంగానికి అనుకూలంగా ఓటు వేశాయి. కేవలం రష్యా మాత్రమే దీన్ని వ్యతిరేకించగా, చైనా ఈ ఓటింగ్‌కు దూరంగా ఉంది. దీంతో 13 సభ్యదేశాల మద్దతుతో జలెన్‌స్కీ ప్రసంగించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events