టీ20 ప్రపంచకప్‌భారత్ చిరకాల కల నెరవేరింది. అందినట్లే అంది చేజారుతూ వస్తున్న ప్రపంచకప్ ఎట్టకేలకు మన చెంతకు చేరింది. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా ఏడు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై చిరస్మరణీయ విజయం సాధించింది. తొలుత విరాట్ కోహ్లీ (59 బంతుల్లో 76, 6ఫోర్లు, 2సిక్స్‌లు), అక్షర్‌పటేల్(31 బంతుల్లో 47, ఫోర్, 4సిక్స్‌లు) బ్యాటింగ్‌తో భారత్ తొలుత 20 ఓవర్లలో 176/7 స్కోరు చేసింది. మహారాజ్, నోకియా రెండేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 169/8 స్కోరు చేసింది. క్లాసెన్(27 బంతుల్లో 52, 2ఫోర్లు, 5సిక్స్‌లు), డికాక్ (39) రాణించారు. హార్దిక్‌పాండ్యా(3/20) మూడు వికెట్లతో విజృంభించగా, అర్ష్‌దీప్‌సింగ్(2/20), బుమ్రా(2/18) రెండేసి వికెట్లతో సత్తాచాటారు. అర్ధసెంచరీతో జట్టు విజయంలో కీలకమైన కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, 15 వికెట్లతో అదరగొట్టిన బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడు.