అమెరికా ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు మరోమారు సత్తా చాటారు. ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికల్లో ఆరుగురు ఇండో అమెరికన్లు విజయం సాధించారు. అరిజోనాలో అమిష్ షా ముందంజలో ఉన్నారు. ప్రతి నిధుల సభలో సెనెటర్లుగా ఉన్న ఐదుగురు ఇండో అమెరికన్లు మరోమారు విజయాన్ని అందుకున్నారు. అమీ బెరా, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, ప్రమీలా జయపాల్, శ్రీ థానెందర్ తిరిగి సభకు ఎన్నికయ్యారు. దీంతో ప్రతినిధుల సభలో ఇండో అమెరికన్ల సంఖ్య ఐదు నుంచి ఏడుకు పెరిగే అవకాశముంది. రాజా కృష్ణమూర్తికి వరుసగా ఇది ఐదో విజయం. అమీ బెరా వరుసగా 7వ సారి విజయం సాధించారు. వర్జీనియాలో గెలుపొందిన తొలి ఇండో అమెరికన్‌గా లాయర్ సుహాస్ సుబ్రమణ్యమ్ చరిత్ర సృష్టించారు.