నవంబర్‌లో జరిగే జి`20 సదస్సుకు రావాలంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీలను ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడొడో ఆహ్వానించారు. జి`20 సదస్సుకు ఈసారి ఇండోనేషియా నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. రష్యా`ఉక్రెయిన్ యుద్ధం విషయంలో తటస్ఠ వైఖరిని నిష్పాక్షిక ధోరణిని అవలంభిస్తున్నామని విడొడొ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై సైనిక చర్చకు దిగిన నేపథ్యంలో జి`20 నుంచి రష్యాను దూరంగా ఉంచాలన్న సభ్యదేశాల వైఖరికి భిన్నంగా ఇండోనేసియా పుతిన్‌ను ఆహ్వానించడం విశేషం. జి`20 సదస్సుకు విడొడో ఆహ్వానించారని, తాను హాజరవుతానని పుతిన్ స్వయంగా క్రటించారు. కాగా ఉక్రెయిన్‌కు ఆహ్వానించడాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంగీకరించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)