యానీయా భరద్వాజ్, కబీర్ దుహాన్‌సింగ్ ప్రధానపాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ఇంద్రాణి. స్టెఫన్ పల్లం దర్శకుడు. స్టాన్లీ సుమన్‌బాబు నిర్మాత. ఈ మూవీ ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సంగీత దర్శకుడు మణిశర్మ, నిర్మాత అనిల్‌సుంకర అతిథులుగా విచ్చేశారు. చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. కథపై నమ్మకంతో ఈ సినిమా నిర్మించాం. వీఎఫ్ఎక్స్ వర్క్ కోసం ఏడాది కష్ట పడ్డాం. ఈ సినిమా ైక్లెమాక్స్ ఊహలకు అందని స్థాయిలో ఉంటుంది. సాంకేతికంగా అన్ని విధాలుగా సినిమా బావుంటుంది. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం దర్శకుడే అని నిర్మాత అన్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఇదని, రెండుగంటల నలభై నిమిషాల పాటు విజువల్ వండర్ చూసి న అనుభూతికి ప్రేక్షకులు లోనవుతారని, టైమ్ మిషిన్, రోబో ఇందులో కీలకంగా ఉంటాయని, రాబోవు యాభై ఏళ్లల్లో ఇండియా ఎంత అడ్వాన్స్‌గా ఉండబోతుందో ఇందులో చూస్తారని దర్శకుడు తెలిపారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యలందరూ మాట్లాడారు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)