ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి తన మనవడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తికి రూ.240 కోట్ల విలువైన షేర్లను బహుమతిగా ఇచ్చారు. దాంతో రోహన్ మూర్తి యంగ్ మిలియనీర్‌గా నిలిచారు. రోహన్ మూర్తికి 15లక్షల ఇన్ఫోసిస్ షేర్లు నారాయణ మూర్తి గిఫ్ట్‌గా ఇచ్చారు. కంపెనీలో మొత్తం విలువలో షేర్లు 0.04శాతం. ప్రస్తుతం నారాయణ మూర్తి వాటా ఇన్ఫోసిస్‌లో 0.40శాతం నుంచి 0.36శాతానికి తగ్గింది. ప్రస్తుతం ఆయనకు కంపెనీలో దాదాపు 1.51కోట్ల షేర్లున్నాయి. ఆఫ్ మార్కెట్ డ్రేడ్‌లో లావాదేవీలు జరిగినట్లు ఫైలింగ్‌లో పేర్కొన్నారు.
ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి – సుధామూర్తి తనయుడు రోహన్ మూర్తి అపర్ణ కృష్ణన్‌తో పెళ్లి జరగ్గా, ఈ జంటకు గతేడాది నవంబర్‌లో కొడుకు పుట్టాడు. దాంతో నారాయణమూర్తి తాత అయ్యారు. ఆ బాబుకి ఏకాగ్రహ్ రోహన్ మూర్తిగా నామకరణం చేశారు. నారాయణమూర్తి-సుధా మూర్తి దంపతులకు కూతురు సైతం ఉన్నారు. ఆమె అక్షతా మూర్తి. ఆమె బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ భార్య.