అమెరికాలో నల్ల జాతీయుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. టెనెస్సీ మెంఫిస్ నగరంలో టైర్ నికోల్స్ (29) అనే నల్ల జాతీయుడిపై పాశవిక దాడికి పాల్పడి అతని ప్రాణాలను బలి తీసుకున్నారు. ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఫెడెక్స్లో ఉద్యోగిగా పనిచేస్తున్న నికోల్స్ కారులో ప్రయాణిస్తూ ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించాడన్న కారణంతో ఐదుగురు పోలీసు అధికారులు అతడిని ఆపారు. పెప్పర్ స్ప్రే ఉపయోగించి దాదాపు 3 నిమిషాలపాటు నికోల్స్ను దారుణంగా చావబాదారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నికోల్స్ దవాఖానలో చికిత్స పొందుతూ మూడు రోజుల తర్వాత (ఈ నెల 10న) మృతి చెందాడు. దీనిపై అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడికి పాల్పడిన పోలీసులు కూడా నల్ల జాతీయులే కావడం గమనార్హం. ఈ నెల 7న జరిగిన ఈ దాడికి సంబంధించిన వీడియోను మెఫిస్ పోలీసులు శుక్రవారం విడుదల చేయడంతో అమెరికా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం స్పందించారు. మృతుడి కుటుంబాన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)