ప్రపంచంలో అందమైన శునకాల పోటీ గురించి వింటుంటాం. కానీ దానికి భిన్నంగా అత్యంత వికారమైన (అంద విహీనమైన) శునకాల పోటీని అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒక సంస్థ నిర్వహించింది. ఇటీవల జరిగిన ఈ పోటీలో ఆ కిరీటాన్ని ఎనిమిదేండ్ల పీకింగీస్ అనే పేరు గల కుక్క ఎగరేసుకుపోయింది.
అత్యంత వికారంగా ఉన్న మరో ఏడు శునకాలను కాదని పికింగీస్ ఈ పోటీల్లో విజేతగా నిలిచింది. అంతకు ముందు కూడా ఈ శునకం ఈ పోటీల్లో నాలుగుసార్లు పాల్గొన్నప్పటికీ విజయం సాధించడం మాత్రం ఇదే మొదటిసారి. కాగా, తామీ పోటీలను గత 50 ఏండ్లుగా నిర్వహిస్తున్నామని, అన్ని జాతుల కుక్కలు ఇందులో పాల్గొనవచ్చునని పోటీలు నిర్వహించిన సంస్థ తెలిపింది. పేరుకు వికారమైన శునకాలు అయినప్పటికీ చూడటానికి ఇవి చాలా అందంగా ఉన్నాయని నిర్వాహకులు వ్యాఖ్యానించడం విశేషం.