![](https://namastenri.net/wp-content/uploads/2024/11/Mayfair-46.jpg)
న్యూజిలాండ్‌కు చెందిన యువ మహిళా ఎంపీ హనా రాహితి కరేరికి మైపి క్లార్క్ వినూత్న రీతిలో పార్లమెంట్ లో నిరసన తెలిపారు. 22 ఏళ్ల మైపి క్లార్క్ మావోరి తెగకు చెందిన మహిళ. అయితే ట్రీటీ ప్రిన్సిపిల్స్ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో ఆమె నిరసన చేపట్టారు. వివాదాస్పద ఆ బిల్లును రెండు ముక్కలుగా చించేశారు. ఆ తర్వాత ఆమె సంప్రదాయ మావోరి నృత్యం చేసింది. ఆ మహిళా ఎంపీతో పాటు మరికొందరు సభ్యులు, ఇంకా గ్యాలరీలో ఉన్న వారు కూడా డ్యాన్స్ చేశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2024/11/Ixora-48.png)