Namaste NRI

నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో  శారీ

రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన చిత్రం శారీ. గిరికృష్ణ కమల్‌ దర్శకుడు. రవిశంకర్‌ వర్మ నిర్మాత. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌లో సత్య యాదు, ఆరాధ్యదేవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రమోషన్‌లో భాగంగా మేడ్చల్‌లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సైన్స్‌ కళాశాల విద్యార్థులతో చిత్రబృందం ఇంటరాక్ట్‌ అయ్యారు. అగ్రదర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ, హీరోహీరోయిన్లు సత్య, ఆరాధ్యదేవి, నిర్మాత రవిశంకర్‌వర్మ, రామ్‌గోపాల్‌వర్మ సోదరి విజయ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుత సమాజంపై సోషల్‌మీడియా ప్రభావం ఎంతవరకు ఉంది అనే విషయంపై విద్యార్థుల అభిప్రాయాలను చిత్రబృందం తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రెండువేల మంది విద్యార్థులు, కాలేజీ యాజమాన్యం, అధ్యాపకులు పాల్గొన్నారు. సమాజంపై సోషల్‌మీడియా విష ప్రభావం ఎలాంటి పరిణామాలకు దారితీస్తున్నది? అనే అంశంపై తీసిన సినిమానే శారీ అనీ, నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా చేశామని రామ్‌గోపాల్‌వర్మ తెలిపారు. ఇంకా చిత్ర యూనిట్‌సభ్యులంతా మాట్లాడారు. ఈ నెల 21న పానిండియా స్థాయిలో సినిమా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events