బార్బీ భామతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లేటు వయసులో ఘాటు ప్రేమలో పడ్డారు. 71 ఏండ్ల పుతిన్ 39 ఏండ్ల కాత్యా మిజులినాతో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. బార్బీ బొమ్మలా కనిపించే ఏకథరినా కాత్యా మిజులినా లండన్‌లో గ్రాడ్యుయేషన్ చేసి, ప్రస్తుతం రష్యా సేఫ్ ఇంటర్నెట్ లీగ్ చీఫ్‌గా పని చేస్తున్నారు. ఏకథరినా మిజులినాతో ఆయన కొంతకాలంగా ప్రేమాయణంలో ఉన్నట్టు రష్యాలోని సామాజిక మాధ్యమంలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. పుతిన్‌కు అనుకూలుడైన మాజీ సెనెటర్ కుమార్తెయే మిజులినా. కాగా, మాజీ ఫ్లైట్ అటెండెంట్ ల్యూడిమిలాను పుతిన్ 1983లో వివాహం చేసుకుని 2014లో విడాకు లు ఇచ్చారు. అనంతరం ఒలింపిక్ బంగారు పతక విజేత అయిన జిమ్నాస్ట్ అలినా కబేవాతో రహస్య సంబం ధాన్ని కొనసాగించాడని, వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని ఆరోపణలున్నాయి.