ఆది పినిశెట్టి, కృష్ణ కురుప్, ఆకాంక్షా సింగ్, నాజర్ ప్రధాన పాత్రల్లో నటించిన ద్వి భాషా చిత్రం క్లాప్. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఆస్తికరంగా ఉంది. భాగ్యలక్ష్మి ఓ గ్రామీణ యువతి జాతీయ అథ్లెట్ (రన్నింగ్)గా ఎలా ఎదిగారు? అనే నేపథ్యంలో సినిమా కథనం ఉంటుంది. తాజాగా క్లాప్ సినిమా ట్రైలర్ను విడుడదల చేశారు. తన పేరు భాగలక్ష్మీ, తనను లాస్ట్ ఇయర్ స్టేట్లో గోల్డ్మెడల్ కొట్టింది. నేను ఇక్కడికి వచ్చింది పరిగెత్తడానికి సార్.. పరిగెడతాను, పరిగెత్తు ఇంకా వేగంగా పట్టుదలతో పరిగెత్తు తప్పకుండా గెలుస్తావ్. ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నవ్వు పోటీ చేసేది మనుషులతో కాదు టైమ్తో వంటి డైలాగ్స్ ట్రైలర్ ఉన్నాయి. కాగా ఈ సినిమా ఓటీటీలో ఈ నెల 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇళయరాజ సంగీతం అందించిన ఈ సినిమాకు పృథ్వీ ఆదిత్య దర్శకుడు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/criminalcourt-300x160.jpg)