తాలిబన్లతో చర్చల సందర్భంగా తాను ఆ ముఠా అగ్ర నాయకుడిని గట్టిగా బెదిరించానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తాలిబన్లతో చర్చలు జరిపా. ఆ సమయంలో ఓసారి తాలిబన్ ఉగ్ర ముఠా సహ వ్యవస్థాపకుడు అబ్దుల్ ఘనీ బరాదర్‌కు ఆయన ఇంటి శాటిలైట్ ఫొటోను పంపించా. మా ఇంటి ఫొటోను ఎందుకు పంపించారు? అని బరాదర్ అడిగారు. అప్పుడు అతడికి నేను ఒకటే చెప్పా. మా సైనికుల్లో ఇంక్కొక్క ప్రాణం పోయినా, మిమ్మల్ని ఏ దేశమూ చేయని విధంగా గట్టిగా దెబ్బకొడతాం అని అన్నా. దాంతో అతడు భయపడి వెనక్కి తగ్గాడు అని ట్రంప్ అన్నారు.