రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ మహిళ అయి ఉంటే ఉక్రెయిన్ యుద్ధం వచ్చి ఉండేది కాదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో పుతిన్ పురుషాహంకారం కనిపిస్తోంది. ఆయన మహిళ అయ్యుంటే పురషాహంభావంతో ఇలాంటి పిచ్చి యుద్ధానికి దిగేవారు కాదు అన్నారు. ప్రపంచంలో శాంతి స్థాపన జరగాలంటే అత్యధిక దేశాల్లో మహిళలు అధికారంలోకి రావాలని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఎదురయ్యే ముప్పులను ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయంపై చర్చించేందుకు నాటో దేశాలు సమావేశమయ్యే కొద్దిసేపటి ముందు బోరిస్ జాన్సన్ ఈ వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ముగిసిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని, కానీ అందుకు ప్రస్తుతం ఏవిధమైన మర్గాలూ కనిపించడం లేదని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు.