Namaste NRI

ఆసక్తిరేత్తిస్తున్న సుధీర్‌బాబు కొత్త సినిమా టైటిల్ పోస్టర్

సుధీర్‌బాబు హీరోగా భవ్యక్రియేషన్స్‌ పతాకంపై వి.ఆనంద ప్రసాద్‌ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పోలీసు నేపథ్యంలో హై ఓల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి హంట్‌ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు.  ఈ సందర్బంగా నిర్మాత వి.ఆనంద్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ సుధీర్‌బాబు ఓ పవర్‌ ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా కన్పించనున్నారని తెలిపారు. ఆయనతో పాటు శ్రీకాంత్‌, భరత్‌ పోలీసులు అధికారులుగా నటిస్తున్నారు. ఈ ముగ్గురూ క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అని, ఇదొక యాక్షన్‌ థ్రిల్లర్‌గా చాలా స్టైలిష్‌గా ఉంటుందన్నారు. సుధీర్‌బాబు సినిమాకు పూర్తి భిన్నంగా ఉంటుందన్నారు.  యాక్షన్‌ సీక్వెన్సులు చాలా సహజంగా, కొత్త  అనుభూతి కల్గిస్తాయని తెలిపారు. శత్రువు కోసం జరిపే వేట ఈ సినిమా ప్రధానాంశం అని అన్నారు. చిత్రీకరణ పూర్తయిందని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. త్వరలో మిగతా వివరాలను తెలిజేస్తామని అన్నారు. భరత్‌ తొలిసారిగా నటిస్తున్న తెలుగు చిత్రమన్నారు. మైమ్‌ గోపి, కబీర్‌ దుహన్‌ సింగ్‌, మౌనిక రెడ్డి, గోపరాజు రమణ, మంజుల తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అరుల్‌ విన్సెంట్‌, సంగీతం: జిబ్రాన్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత : అన్నే రవి.

Social Share Spread Message

Latest News