Namaste NRI

కార్తీ జపాన్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌

కార్తీ  నటిస్తున్న చిత్రం జపాన్‌. ఈ చిత్రాన్ని డ్రీమ్‌ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఆర్ ప్రకాశ్‌ బాబు, ఎస్‌ ప్రభు నిర్మిస్తున్నారు. రాజు మురుగన్‌ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో అనూ ఎమ్మాన్యుయేల్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇప్పటికే జపాన్ నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్‌ లుక్ పోస్టర్‌తోపాటు ఇంట్రడక్షన్‌ వీడియో సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. మరోవైపు జపాన్ టీజర్‌ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతూ,  సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. తెలుగు థ్రియాట్రికల్ రైట్స్‌ను పాపులర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ( అక్కినేని నాగార్జున హోంబ్యానర్‌) అన్నపూర్ణ స్టూడియోస్ దక్కించుకుంది.

హర్ట్‌ ఆఫ్ ది సిటీలో ఒకడు కన్నం వేసి రూ.200 కోట్ల విలువ చేసే నగలు ఎత్తుకెళ్తే,  మీ లా అండ్ ఆర్డర్‌ లా చూస్తూ కూర్చుందా అనే డైలాగ్స్‌తో సాగుతున్న టీజర్‌ సినిమాలో కార్తీ మోస్ట్‌ పాపులర్ దొంగ జపాన్‌ పాత్రలో ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించనున్నట్టు క్లారిటీ ఇచ్చేసింది. జపాన్‌లో కార్తీ ఇదివరకెన్నడూ కనిపించని నయా స్టైలిష్‌ లుక్‌తో సందడి చేస్తున్నాడు. మీరనుకుంటున్నట్టు కాదు వాడు దూల తీర్చే విలన్‌ అంటూ కార్తీ క్యారెక్టరైజేషన్‌ను ఎలివేట్‌ చేస్తున్న విజువల్స్‌ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి.

జపాన్‌లో సునీల్, విజయ్‌ మిల్టన్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నాడు. జపాన్‌కు అన్బరివ్‌ యాక్షన్‌ కొరియోగ్రఫర్‌. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుండగా, రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events