అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్యసేవల్లో నాణ్యత ప్రమాణాలు, రోగుల సంరక్షణ, తదితర విషయాల్లో ఏషియాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీకి) అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అమెరికాకు చెందిన జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ (జేసీఐ) సంస్థ తాజాగా ఏఐజీకి ది గోల్డ్ సీల్ అప్రూవల్ లభించింది. గోల్డ్సీల్తో కూడిన అంతర్జాతీయ ధ్రువీకరణ పత్రాన్ని ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి జేసీఐ అందచేసింది. అంతర్జాతీయంగా ప్రాచుర్యం ఉన్న గుర్తింపు ఇవ్వడానికి ఏఐజీలో దాదాపు 1300కు పైగా వేర్వేరు అంశాలప సునిశితంగా పరిశీలన జరిపారు. నిత్యం 600కు పైగా ఐపీ రోగులు, 2000కు పైగా ఓపీ రోగులు పూర్తిస్థాయి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్య సేవలను పొందుతున్న తీరును జేసీఐ ప్రతినిధులు పరిశీలించినట్టు పేర్కొన్నాయి. గత రెండేళ్లుగా కొవిడ్ వంటి కఠిన సమయాల్లోనూ నాణ్యత ప్రమాణాల్లో రాజీ లేకుండా వైద్య సేవలందించినందుకు గాను ఈ ప్రోత్సాహకం లభించిందని ఏఐజీ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర రెడ్డి తెలిపారు. ఏఐజీకి జేసీఐ అక్రెడిటేషన్ లభించండం తెలంగాణ మెడికల్ హబ్‌కు గర్వకారణమని పేర్కొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)