తెలంగాణ రాష్ట్రంలోని పోచంపల్లి గ్రామం అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ ఈ గ్రామాన్ని బెస్ట్ టూరిజం విలేజ్‌గా ఎంపికైంది. ప్రతిష్టాత్మక ఈ అవార్డు కోసం భారత్ నుంచి 3 ఏంట్రీలు పంపగా, అందులో భూదాన్ పోచంపల్లిగా పేరొందిన పోచంపల్లి గ్రామం అవార్డుకు ఎంపికైంది. ఎంట్రీలుగా పంపిన మిగతా రెండు గ్రామాల్లో ఒకటి మేఘాలయంలోని కోంగ్‌తాంగ్, కాగా మరో గ్రామం మధ్యప్రదేశ్‌లోని లాధ్‌పూరా ఖాస్. స్పెయిన్ దేశ రాజధాని మాడ్రి డ్‌లో ఈ ఏడాది డిసెంబర్ 2న జరిగే యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ జనరల్ అసెంబ్లీ 24న సెషస్ సందర్భంగా ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)