Namaste NRI

మాటా ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

మన అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (మాటా) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం న్యూజెర్సీలోని రాయల్‌  ఆల్బర్ట్స్‌ ప్యాలెస్‌లో ఘనంగా నిర్వహించారు.   ప్రముఖ సింగర్‌, బిగ్‌ బాస్‌ ఫేం దామిని భట్ల, నటి అంకితా జాదవ్‌ ప్రత్యేక అథిథులుగా పాల్గొన్నారు.  సింగర్‌ దామిని తన పాటలతో ఉత్సాహన్ని నింపారు. అంకితా జాదవ్‌ కార్యక్రమానికి మరింత గ్లామర్‌ జోడిరచారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో అద్భుతంగా రాణిస్తోన్న 1,000 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు.  వారి విజయాలకు గుర్తింపుగా మాటా అవార్డులిచ్చి సత్కరించింది.  స్మితా రావు ( శాస్త్రవేత్త, పరేరా బ్యూటీ సంస్థ ఫౌండర్‌ అండ్‌ సీఈవో), అంజలి మెహ్రోత్రా ( ఫౌండర్‌ ఆఫ్‌ ఈక్వాలిటీ, పీరియస్‌), డాక్టర్‌ సరస్వతి లక్కసాని ( బోర్డు` సర్టిఫైడ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌, ఛాంపియన్‌ ఆఫ్‌ కమ్యూనిటీ హెల్త్‌), ప్రేమా  రోడం ( ఇమ్మిగ్రేషన్‌ అటార్నీ, ఎక్సలెన్స్‌ ఇన్‌ లీగల్‌ లీడర్‌షిప్‌) కు అవార్డులతో మాటా సత్కరించింది.

ఈ సందర్భంగా మాటా లీగల్‌ అడ్వకేసీ సపోర్ట్‌ కమిటీని ప్రారంభించింది. ఈ కమిటీ ద్వారా హక్కులు, ఇమిగ్రేషన్‌కు సంబంధించిన విలువైన సలహాలు, సూచనలతో పాటు ఇతర చట్టపరమైన వివరాలు తెలుసుకునేందుకు  అవకాశం కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో మాటా అధ్యక్షుడు రమణ కిరణ్‌ దుద్దాగి మాట్లాడుతూ  స్పాన్సర్లు, మాటా యూత్‌ కమిటీ, కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు, నృత్య పాఠశాలలు, స్పీకర్లు, స్వచ్ఛంద సేవలకులకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని రంగాల్లో మహిళల నాయకత్వం, భాగస్వామ్యం, సాధికారతను పెంపొందించడంలో మాటా నిరంతరం ముందుంటుందని స్పష్టం చేశారు.

ఈ వేడుక జరగడానికి దీప్తి నాగ్‌ (మహిళ కమిటీ ఛైర్‌), శిరీష గుండపునేని ( ఆధ్యాత్మిక, సభ్యత్వ డైరెక్టర్‌), కళ్యాణి బెల్లంకొండ ( కమ్యూనిటీ సర్వీసెస్‌ డైరెక్టర్‌)తో పాటు మాటా మహిళా నాయకులు, వాలంటీర్ల కృషి ఎంతగానో ఉంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఆర్‌ఎస్‌వీపీల సహాయ సహకారాలు కూడా కీలక పాత్ర పోషించాయి. శ్రీనివాస్‌ గనగోని ( మాటా వ్యవస్థాపకుడు, సలహా మండలి సభ్యుడు), రమణ కిరణ్‌ దుద్దాగి ( అధ్యక్షుడు), ప్రవీణ్‌ గూడూరు (కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు), విజయ్‌ భాస్కర్‌ కలాల్‌ ( జనరల్‌ సెక్రటరీ), సరస్వతి లక్కసాని ( ఆరోగ్యం, వెల్‌నెస్‌ డైరెక్టర్‌) సురేష్‌ కాజానా ( క్రీడా డైరెక్టర్‌), గౌరవ సలహాదారులతో పాటు, జితేందర్‌ రెడ్డి ( సలహా మండలి సభ్యుడు), ప్రదీప్‌ సామల ( వ్యవస్థాపకుడు, సలహా మండలి సభ్యుడు) హాజరయ్యారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events