Namaste NRI

డల్లాస్‌లో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం

అమెరికాలోని  డల్లాస్‌లో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో నరసరావుపేట శాసన సభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు, కోడెల శివప్రసాదరావుకి నివాళులు అర్పించారు. అనంతరం చదలవాడ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి-సంక్షేమం ప్రధాన అజెండాగా ముందుకెళుతోందని అన్నారు. తద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. వచ్చే 15-20 ఏళ్ళు కూటమి అధికారంలో ఉంటుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీ అభివృద్ధి దిశగా పయనిస్తోందని, నరసరావుపేటలో అనేక అభివృద్ధి పనులు ప్రారంభించామని తెలిపారు.  

నరసరావుపేట రూరల్ పార్టీ ప్రెసిడెంట్ బండారుపల్లి విశ్వేశ్వరరావు, ఎన్నారై టీడీపీ ప్రతినిధులు కేసీ చేకూరి, సుధీర్ చింతమనేని తదితరులు ప్రసంగించారు. జొన్నలగడ్డ, దొండపాడు, పాములపాడు, రావిపాడు, ముత్తనపల్లి, నరసరావుపేట, పల్నాడు జిల్లాకు చెందిన పలువురు ఎన్నారైలు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News