ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్‌లో భారత జాగృతి ఆధ్వర్యంలో జరిగిన బోనాల ఉత్సవాల్లో భారతీయులకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ప్రవాసీ తెలంగాణ వాసులు, జాగృతి కార్యకర్తలతో కలిసి కవిత బోనంతో స్థానిక దేవాలయానికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ దేశంలో రెండు ఐటీ ఉద్యోగాలు ఉంటే అందులో ఒకటి తెలంగాణలోనే ఉంటుం దని అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ నాటికి ఐటీ పరిశ్రమలో తెలంగాణలో3.5 లక్షల ఉద్యోగాలు ఉంటే ఇప్పుడు 9.5 లక్షలకుపైగా ఉన్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సంపదను పెంచి నిరుపేదలకు పంచుతున్నదన్నారు. జీఎస్డీపీలో జాతీయ సగటు కంటే తెలంగాణ ఎక్కువ నమో దు చేసిందని చెప్పారు.
భారత సంస్కృతిని, తెలంగాణ సంప్రదాయాలను ఆస్ర్టేలియా దేశానికి విస్తరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. బ్రిస్ బేన్ లో ఉన్న తెలుగువారు, భారతీయులకు అభినందనలు తెలిపారు. ఆ దేశ చట్టాలను గౌరవిస్తూ ఉన్నతంగా జీవించాలని, సామాజిక సేవ చేయాలని ఆకాంక్షించారు. ఆస్ట్రేలియా రాజకీయాల్లో భారతీయులు రాణిస్తుండడం గర్వకారణమన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సుదీర్ఘ కాలం పోరాటం చేశామని, 60 ఏళ్ల పోరాటం తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కల సాకారమయ్యిందని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన 9 ఏళ్లలోనే అన్ని రంగాల్లో తెలంగాణ వేగంగా ముందు కెళ్తున్నదని, ప్రజల ఆకాంక్షలు నెరవేరాయని స్పష్టం చేశారు. దాదాపు అన్ని రంగాల్లో తెలం గాణ నెంబర్ వన్ గా ఉందని తెలిపారు. గ్రామీణ, పట్టణా లను రాష్ట్ర ప్రభుత్వం సమాం తరంగా అభివృద్ధి చేస్తోందని చెప్పారు.
బోనాల ఉత్సవాల్లో తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షులు శ్రీకర్ రెడ్డి అందెం, బీఆర్ఎస్ ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షులు కాసర్ల నాగేందర్ రెడ్డి, బిటి ఏ ప్రెసిడెం ట్ కిషోర్, నాయకులు విజయ్ కోరబోయిన, స్వప్న దోమ, విరించి రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.