Namaste NRI

శ్రీవిష్ణు హీరోగా ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌

శ్రీవిష్ణు హీరోగా,  హుస్సేన్‌ షా కిరణ్‌ దర్శకత్వంలో లైట్‌ బాక్స్‌ మీడియా, పిక్చర్‌ పర్‌ఫెక్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై సందీప్‌ గుణ్ణం ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా ఓ వినూత్నమైన పాయింట్‌ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, శ్రీవిష్ణు పాత్ర సరికొత్త పంథాలో ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా అరవైశాతం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. పరిశోధనాత్మక థ్రిల్లర్‌ జోనర్‌లో విభిన్న కథాంశ మిది అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విద్యాసాగర్‌, సంగీతం: కాలభైరవ, ఎడిటర్‌: శ్రీకర్‌ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: మనీషా ఏ దత్‌, దర్శకత్వం: హుస్సేన్‌ షా కిరణ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events