
అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను దిగ్విజయం చేయాలనే సంకల్పంతో తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని నాట్స్ బృందం దర్శించుకుంది. ఆ దేవదేవుడి హుండీలో నాట్స్ సంబరాల ఆహ్వాన పత్రికను సమర్పించి ఆ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోరుకుంది. తెలుగు వారి ఇంట ఏ శుభకార్యం జరిగినా ఆహ్వాన పత్రికను ఆ తిరుమలేశునికి సమర్పించడం ఓ సంప్రదాయం. అమెరికాలో ప్రతి రెండేళ్లకు జరిగే అమెరికా తెలుగు సంబరాలను నాట్స్ శుభకార్యంగా భావిస్తోంది. ఈ క్రమంలోనే తిరుమలను నాట్స్ టీం దర్శించుకుని ఆహ్వాన పత్రికను వేంకటేశ్వరునికి సమర్పించింది. జులై4,5,6 తేదీల్లో టంపా వేదికగా అమెరికా తెలుగు సంబరాలను జరగనున్నాయి. ఇందులో మన సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా జరగనున్నాయి.

