ప్రజాస్వామ్యంపై నిర్వహించతలపెట్టిన వర్చువల్ సమావేశానికి భారత్ సహా 110 దేశాలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానించారు. అయితే ఈ సమావేశానికి చైనా, రష్యాలను దూరం పెట్టారు. డిసెంబర్ 9`10 తేదీల్లో నిర్వహించే ఈ భేటీ అమెరికా నేతృత్వంలోని నాటో సభ్యదేశం టర్కీకి కూడా ఆహ్వానం అందలేదు. చైనా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలనుకుంటున్న తైవాన్‌కు పిలుపు అందింది. ఇది అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతల్ని మరింత పెంచే అవకాశం ఉంది. అక్కడి విదేశాంగ శాఖ ప్రచురించిన ఆహ్వాన దేశాల జాబితాలో ఇరాక్, పాకిస్థాన్ పేర్లు కూడా ఉన్నాయి. దక్షిణాసియాలో అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలకు ఆహ్వానం అందలేదు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)