సికింద్రాబాద్‌లో ఈ నెల 25, 26 తేదీల్లో జరిగే శ్రీఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి ఆహ్వానం పలికారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌కు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆలయ వేద పండితులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ సురిటి కామేశ్, పాలక మండలి సభ్యులతో పాటు రాంగోపాల్‌పేట మాజీ కార్పొరేటర్ అరుణాగౌడ్ పాల్గొన్నారు