Namaste NRI

నేటి నుంచి ఐపీఎల్ సమరం

ప్రపంచం వ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ 15వ సీజన్‌కు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి ఐపీఎల్‌ 2022కు తెర లేవనుంది. తొలి మ్యాచ్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. అయితే ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని క్విక్‌ రెస్పాన్స్‌ బాంబ్‌ స్క్వాడ్‌ హెచ్చరికలు జారీ చేసింది. డిఫెండిరగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌, రన్నరప్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. మార్చి 26న మొదలయ్యే మెగా టోర్నీ మే 29న జరిగే ఫైనల్‌తో ముగియనుంది. తాజా సీజన్‌లో లక్నో సూపర్‌ జెంట్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ అరంగేట్రం చేయనుండటంతో మొత్తం జట్ల సంఖ్య 10కు చేరింది. పదిజట్లు రెండు  గ్రూపులుగా తలపడనున్నాయి. స్టార్‌ స్పోర్ట్స్‌ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. తాజా సీజన్‌లో ముంబై ఇండియన్స్‌, చెన్నై  సూపర్‌కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, డిళ్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, పంజాబ్‌ కింగ్స్‌, లక్నో సూపర్‌జెయింట్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ టైటిల్‌ వేటలో బరిలోకి  దిగనున్నాయి. ఐపీఎల్‌ 2022 టైటిల్‌ స్పాన్సర్‌గా దేశీయ వ్యాపార దిగ్గజం టాటా వ్యవహరించనుంది. ఆటగాళ్ల బస చేసే హోటల్‌ వద్ద టెర్రరిస్టులు రెక్కీ నిర్వహించారంటూ కొన్ని మీడియాలలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ముంబై డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ సంజయ్‌ లట్కర్‌ అన్నారు. అయితే హోటల్‌ ట్రెడెంట్‌, వాంఖడే స్టేడియం, ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న 1.5 కిలోమీటర్ల మార్గంలో తగినంత భద్రతను ఏర్పాటు చేశామని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events