Namaste NRI

ఐపీఎల్ ప్రీ-రిలీజ్ వేడుక

విశ్వ కార్తికేయ, శరణ్, అవంతిక, అర్చన గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఐపీఎల్. బీరం వరలక్ష్మి సమర్పణలో అంకిత మీడియా హౌస్ పతాకంపై బీరం శ్రీనివాస్ నిర్మించారు. సురేష్ లంకలపల్లి దర్శకుడు. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, పృథ్వీ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.  తాజాగా చిత్ర ప్రీ  రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో విశ్వ కార్తికేయ మాట్లాడుతూ ఒక మూవీ పూర్తి చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆ చిత్రాన్ని రెండు వందల థియేటర్స్‌లో విడుదల చేయడం మరో విశేషం. మా చిత్రానికి సంగీతం బాగా కుదిరింది. నిజాయితీగా ఒక ప్రయత్నం చేశాం అన్నారు. దర్శకుడు సురేష్ లంకలపల్లి మాట్లాడుతూ మా అమ్మ వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది. క్రికెట్‌ను  తీవ్రవాదాన్ని ముడిపెట్టి ఈ చిత్రాన్ని రూపొందించాం. మంచి సందేశంతో పాటు ప్రేక్షకులకు నచ్చే అంశాలుంటాయి అన్నారు. ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ఏకే ఆనంద్, సంగీతం : వెంగి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events