సాయి చరణ్, పల్లవి జంటగా శ్రీనివాస్ జి.ఎల్.బి తెరకెక్కిస్తున్న చిత్రం ఐక్యూ. కాయగూరల లక్ష్మీపతి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సుమన్ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ వినూత్నమైన కథాంశంతో రూపొందిన చిత్రమిది. ప్రస్తుతం సత్యప్రకాష్పై ఓ ఐటెం గీతం చిత్రీకరిస్తున్నాం. సినిమాలో రెండు పాటలు చాలా బాగా వచ్చాయి. ఇందులో ప్రతి పాత్ర హైలైట్ అవుతుంది అన్నారు. ఈ నెల 25తో షూటింగ్ పూర్తవుతుంది. నిర్మాత కాయగూరల లక్ష్మీపతి మాట్లాడుతూ ఈ చిత్రాన్ని దసరా పండుగ రోజున విడుదల చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం : ఘటికాచలం, ఛాయాగ్రహణం: సురేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో హీరో సాయి చరణ్, హీరోయిన్ పల్లవి, సుమన్ పాల్గొన్నారు.














