Skip to main content

Namaste NRI

డొనాల్డ్ ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయడానికి ఇరాన్ ఇటీవల కొత్తగా కుట్ర పన్నిందని ఇజ్రాయిల్ నిఘా వ్యవస్థ వాషింగ్టన్‌కు తెలియజేసింది. ఇరాన్ – అమెరికా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అనిశ్చితిలో పడిన నేపథ్యంలో ఈ సమాచారం మరింత ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉంది. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ నుంచి ఈ వారంలోనే హెచ్చరిక సందేశం వచ్చింది. ట్రంప్‌ను ఎలా హతమార్చాలన్న విషయంపై ఇరాన్ రూపొందిస్తున్న ప్రణాళికలకు సంబంధించిన సమాచారం అమెరికాకు గత కొన్ని వారాలుగా నిరంతరం అందుతూనే ఉంది. అయితే ఇజ్రాయిల్ నుంచి వచ్చిన హెచ్చరిక తాజాది. ఇది ఓ నిర్దిష్ట కుట్రకు సంబంధించింది.

Social Share Spread Message

Latest News