ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారం ఈ ఏడాది ఇరాన్‌కు చెందిన మానవహక్కుల కార్యకర్త నర్గీస్ మొహమ్మదీని వరించింది. ఇరాన్‌లో మహిళల అణిచివేతకు వ్యతిరేకంగా ఆమె చేస్తున్న పోరాటాన్ని గుర్తిస్తూ ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు నార్వే నోబెల్ కమిటీ చైర్‌పర్సన్ బెరిట్ రెయిస్-ఆండర్సన్ ఓస్లోలో ప్రకటించారు. ఈ పురస్కారం కింద మొహమ్మదీకి 110 లక్షల స్వీడిష్ క్రోనార్ల (దాదాపు రూ.8.32 కోట్ల) నగదు బహుమతితోపాటు 18 క్యారెట్ల బంగారు పతకాన్ని, ఓ డిప్లొమాను అందజేయనున్నారు. డిసెంబర్‌లో ఈ పురస్కార ప్రదానం జరుగుతుంది.
