Skip to main content

Namaste NRI

ఇరాన్‌ కీలక నిర్ణయం… అన్ని విమానాలను

ఇరాన్‌ పై ప్రతికారేచ్చతో రగిలిపోతున్న ఇజ్రాయెల్‌ అన్నంత పనీ చేసింది. టెహ్రాన్‌పై బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్‌కు చెందిన సైనిక స్థావరాలే లక్ష్యంగా శనివారం తెల్లవారుజామున నుంచి ఇజ్రాయెల్‌ దళాలు విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌కు రాకపోకలు సాగించే అన్ని విమానాలను రద్దు చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, భద్రతా సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. తదుపరి నోటీసులు వచ్చే వరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఇరాన్‌ పౌర విమానయాన సంస్థ ప్రతినిధి జాఫర్‌ యాజర్లౌ వెల్లడించారు. అన్ని మార్గాల్లోని విమానాలను రద్దు చేసినట్లు స్పష్టం చేశారు.

Social Share Spread Message

Latest News