ఎన్టీఆర్, ప్రశాంత్‌నీల్ కాంబినేషన్ ప్రకటన వచ్చినప్పట్నుంచీ ఈ సినిమా అప్‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వీరి సినిమాపై ఓ వార్త ప్రస్తుతం హల్‌చల్ చేస్తున్నది. ఎన్టీయార్ 31 వర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మిస్తున్న వీరి చిత్రానికి డ్రాగన్ అనే పేరును ఖరారు చేసినట్టు ఈ వార్త సారాంశం. ఈ పేరుతో కొన్ని పోస్టర్లు కూడా ఎక్స్‌లో దర్శనమిస్తున్నాయి. అక్టోబర్‌లో పట్టాలెక్కనున్న ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్‌నీల్ రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారట.త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని తెలుస్తున్నది.