పవన్‌కల్యాణ్ తాజా చిత్రం ఉస్తాద్ భగత్‌సింగ్ వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే విడుదలైన ‘దేఖ్ లేంగే సాలా’ పాట రికార్డు స్థాయి వీక్షణలతో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. దర్శకుడు హరీష్‌శంకర్ కాంబో సినిమా ఇదే కావడం కూడా సెంటిమెంట్‌గా మారింది. ఈ నేపథ్యంలో సినిమా విడుదల తేదీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటికొచ్చింది. ఏప్రిల్ 23 లేదా 24న వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ టాక్.

సమ్మర్ సీజన్‌లో అదే పర్‌ఫెక్ట్ రిలీజ్ డేట్‌గా భావిస్తున్నారట. త్వరలో ఈ విషయమై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం. శ్రీలీల, రాశీఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఆర్ట్: ఆనంద్‌సాయి, నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, రచన-దర్శకత్వం: హరీష్‌శంకర్ ఎస్.















