సిరియాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. అలెప్పో సమీపంలో ఇజ్రాయెల్ సైన్యం, తిరుగుబాటు వర్గాల వైమానిక దాడుల్లో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని సిరియా సైనిక వర్గాలు తెలిపాయి. ఈ దాడుల్లో సైనికులతోపాటు సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమ య్యాయి. అలెప్పో, దాని పరిసర ప్రాంతాలపై తిరుగుబాటు వర్గాలు విరుచుకుపడ్డాయని సిరియా ప్రభుత్వ మీడియా తెలిపింది. యుద్ధాన్ని పరిశీలిస్తున్న బ్రిటన్‌కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. అలెప్పో సమీపంలో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో దాదాపు 42 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ మద్దతుగల హిజ్బుల్లా ఉగ్రవాదులు సిరియాలో ఉండటంతో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తున్నది.